సీతాఫలాల సాగుతో మంచి లాభాలు.!

Telugu Lo Computer
0


సీతాఫలం పండ్లను తేలికపాటి నేలల్లో సాగు చేసే ఈ పంటలు పండించడం వల్ల మంచి లాభాలు వస్తాయి. సీతాఫలం పండ్లను పండించేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరి పోతుంది. వర్షా కాలం మొదలైనప్పుడు సీతా ఫలం మొక్కలు నాటితే మంచిది. అలానే సీతాఫలం మొక్కలకి కంపోస్ట్, ఎరువులతో పాటు కుళ్ళిన ఎరువులు కూడా వేస్తే మంచిది. క్రమం తప్పకుండా నీళ్లు కూడా పోయాలి. ఇలా చేస్తే పంట బాగా వస్తుంది. అయితే మొదటి నాలుగు సంవత్సరాల పాటు నీళ్లు అందించడం వల్ల మొక్క బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంటే మంచి లాభాలను పొందాలంటే బాలా నగర్ జాతులకు చెందిన చెట్లను నాటితే మంచిది. ఈ పంటలు పండించడానికి నీళ్లు, ఎరువులు వంటి వాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలని సీతాఫలం సాగుతో పొందొచ్చు. సక్రమంగా చేస్తే లక్షల్లో కూడా లాభాలు సీతాఫలం సాగుతో పొందొచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)