సుప్రీం కోర్టు ఆదేశాలిస్తేనే బహిరంగ మరణ శిక్షలు'

Telugu Lo Computer
0


అఫ్గాన్‌ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయనంతవరకు దేశంలో బహిరంగ మరణ శిక్షల అమలు, మృతదేహాల వేలాడదీత చేయొద్దని తాలిబన్‌ ప్రభుత్వం స్థానిక అధికారులకు స్పష్టం చేసింది. సంబంధిత నేరస్థుడిని ప్రజల మధ్య శిక్షించాల్సిన అవసరం లేనప్పుడు, కోర్టు ఆదేశాలు రానంతవరకు బహిరంగ శిక్షలు విధించకూడదని మంత్రిమండలి నిర్ణయించినట్లు తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్‌ చేశారు. ఒకవేళ నేరస్థుడిని బహిరంగంగా శిక్షించినట్లయితే,  అతను చేసిన నేరం గురించి ప్రజలకు తెలిసేలా వివరించాలని చెప్పారు. అఫ్గానిస్థాన్‌లో 1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు- చేతులు నరకడం, బహిరంగ మరణశిక్షలు వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని ఇటీవల తాలిబన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్‌ తురాబీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అఫ్గాన్‌ ప్రజలకు అండగా నిలుస్తామని, తాలిబన్లు తమ దారుణాలకు ముగింపు పలకాలని డిమాండ్‌ చేసింది. గతంలో అఫ్గాన్‌లో హంతకులను బహిరంగంగా కాల్చిచంపడం, దొంగల కాళ్లు- చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో ఉండేవి.

Post a Comment

0Comments

Post a Comment (0)