చార్‌ ధామ్‌ యాత్ర మార్గదర్శకాలు విడుదలు

Telugu Lo Computer
0
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చార్‌ధామ్‌ యాత్రకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్‌తో పాటు ఈ-పాస్‌ తప్పనిసరిగా చేసింది. అలాగే రెండు మోతాదుల కొవిడ్‌ టీకా లేదంటే.. కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా చూపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ ప్రయాణానికి 72 గంటల కంటే ఎక్కువ సమయం మించకూడదని పేర్కొంది. ఉత్తరాఖండ్‌ హైకోర్టు యాత్రలో రోజువారీగా పాల్గొనే భక్తుల సంఖ్యపై ఉన్న పరిమితిని తొలగించింది. దీంతో ఇకపై యాత్రలో పాల్గొనేందుకు భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి ఉండదు. ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ కొవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి చార్‌ధామ్‌ యాత్రలో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇస్తూ.. నిషేధాన్ని ఎత్తి వేసింది. ఇంతకు ముందు కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే భక్తుల సంఖ్యపై కోర్టు పరిమితి విధించింది. బద్రీనాథ్‌కు రోజుకు వెయ్యి మంది, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మంది వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే చార్‌ధామ్‌ పరిధిలో ఉన్న నదుల్లో స్నానాలు చేయడంపై సైతం నిషేధం విధించింది. అయితే, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచాలని కోర్టును కోరుతూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)