ఆన్ లైన్ లో అధికరేట్లకు అమ్మకాలు

Telugu Lo Computer
0

.


శ్రీవారి భక్తులను అందినకాడికి దోచుకోవడం అక్రమార్కులకు అలవాటే.   2022వ ఏడాదికి సంబంధించిన టీటీడీ క్యాలెండరు, డైరీలను తమ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్ లైన్లో విక్రయించడం మొదలుపెట్టారు. టీటీడీలో లభ్యమయ్యే ధరలకంటే కంటే రెట్టింపు ధరకు అమ్ముతూ భక్తులకు పంగనామాలు పెడుతున్నారు. టీటీడీ ద్వారా 12 పేజీల క్యాలెండర్ ధర 130 రూపాయలు కాగా ఆన్ లైన్లో దేవుళ్లు.కామ్ ద్వారా రూ.198కి విక్రయిస్తున్నారు. ఇక రూ.150 విలువ చేసే డెయిరీని రూ.243కు విక్రయిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి టీటీడీ తిరుమల,తిరుపతిలో క్యాలెండరు, డైరీల విక్రయాలను ప్రారంభించింది.. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన భక్తులు పబ్లికేషన్ స్టాల్స్ తో పాటు పలు చోట్ల విక్రయిస్తోంది. డైరీలు, క్యాలెండర్లకు కొరత రాకుండా టీటీడీ భారీ సంఖ్యలోనే ప్రింట్ చేయించి అందుబాటులో ఉంచింది. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో టీటీడీ క్యాలెండరు, డైరీల విక్రయాలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈలోపే కొందరు క్యాలెండరు, డైరీలను ఆన్ లైన్ లో అధిక ధరలకు విక్రయిస్తూ ఉండడంతో భక్తులు వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆన్ లైన్లో అధిక ధరలకు విక్రయిస్తున్న సమాచారం టీటీడీ దృష్టికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టీటీడీ ఔట్ లెట్స్ లో మాత్రమే భక్తులు క్యాలెండర్లు, డైరీలు కొనుగోలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. త్వరలోనే ఆన్ లైన్లో విక్రయాలు ప్రారంభించేందుకు కూడా ప్రయత్నిస్తామని టీటీడీ ప్రకటించింది. మోహన్ పబ్లికేషన్స్ కు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదన్న అధికారులు సదరు సంస్థపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)