మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనున్న "సభకు నమస్కారం" - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 20 October 2021

మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనున్న "సభకు నమస్కారం"

 


సభకు నమస్కారం అనే  సినిమా చేయడానికి అల్లరి నరేష్ సిద్ధమయ్యారు. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఈమధ్యనే మహేష్ కోనేరు గుండెపోటుతో కాలం చేసిన సంగతి తెలిసిందే. మహేష్ కోనేరు మరణం తర్వాత సినిమా నిర్మాణం ఆగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏకే ఎంటర్ టైన్మెంట్స్ వారు ఇప్పుడు ఈ సినిమాని సొంతం చేసుకున్నారు. "సభకు నమస్కారం" సినిమా నిర్మాణ వ్యవహారాలను చూసుకోవడానికి వారు ముందుకు వచ్చారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక పొలిటీషియన్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.

No comments:

Post a Comment