షేర్‌ హోల్డర్లకు కనక వర్షం!

Telugu Lo Computer
0


టాటా మోటార్స్ షేర్‌ హోల్డర్లకు ఈరోజు కనక వర్షం కురిసింది. ఈ స్టాక్‌ ధర ఓ దశలో ఏకంగా 22 శాతానికి పైగా పెరిగి రూ.523 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. దీంతో మదుపర్లకు లాభాల పంట పండింది. టాటా మోటార్స్‌ విద్యుత్తు వాహన విభాగంలోకి టీపీజీ రైజ్‌ క్లైమేట్‌ నుంచి బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7500 కోట్లు) సమీకరించడమే ఇందుకు కారణం. ఉదయం ఈ స్టాక్ రూ.462 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. చివరకు 21.11 శాతం లాభంతో రూ.509.70 వద్ద ముగిసింది. ఏడాది క్రితం రూ.126 వద్ద ట్రేడైన ఈ షేరు.. ఏకంగా 415 శాతం ఎగబాకడం విశేషం. గత మూడు రోజుల్లోనే ఈ స్టాక్‌ విలువ 46 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.81 లక్షల కోట్లకు చేరింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)