పిల్లల్లో ఊబకాయం - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0

 


ఈ మధ్య పిల్లల్లోకూడా ఊబకాయం సమస్య వస్తోంది. అయితే పిల్లలకు ఈ ఊబకాయం సమస్య వస్తే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే ఆరోగ్యం సమస్యలు కూడా వస్తాయి. పిల్లలకు ఊబకాయం రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. 

పోషకాహారం: పిల్లలకి ఎప్పుడు కూడా పోషకాహారం ఇవ్వండి. కూరగాయలు, పండ్లు, గింజలు, నట్స్ వంటివి వాళ్ళ యొక్క డైట్ లో ఉండేటట్టు క్రమం తప్పకుండా చూడాలి. 

వ్యాయామం : చిన్న చిన్న వ్యాయామాలు చేయించండి.  ఫిజికల్ యాక్టివిటీ లేక పోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కనుక రన్నింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్ లాంటివి చేయిస్తూ ఉండండి. వ్యాయామం చేయడం వల్ల కేలరీలు కరుగుతాయి అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఆటలు : ఈ మధ్య కాలం లో పిల్లలు స్మార్ట్ ఫోన్ మరియు టీవీలకే అంకితమైపోతున్నారు ఇది చెడు అలవాటు. రోజుకి గంట కంటే ఎక్కువ సేపు పిల్లలకి ఫోన్, టీవీ అలవాటు చేయకండి. వీలైనంత వరకూ మామూలు ఆటలని ఆడించడం మంచిది.

టీవీ చూస్తూ తిననివ్వద్దు: టీవీ ముందు కూర్చుని తినడం వల్ల ఎంత తింటున్నారో తెలియదు. దీని వల్ల కూడా ఊబకాయం సమస్య వస్తుంది.

తక్కువ ఆహారాన్ని ఇవ్వండి: ఒకేసారి ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వాళ్లకి ఆహారం ఇవ్వండి. ఇలా తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఊబకాయం సమస్య రాకుండా ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)