అదనపు ఛార్జీలు లేవు

Telugu Lo Computer
0




పండుగల సీజన్లో ప్రజల ప్రయాణ అదనపు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలం నుంచి ఆర్టీసీలో దసరా సెలవుల్లో ప్రజలు స్వగ్రామాలకు వెళ్లాలంటే సాధారణ చార్టీకంటే 50 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తున్న విషయం తెలిసిందే ఉన్నడి రాష్ట్రం నుంచీ ఈ అదనపు బాదుడు కొనసాగుతూనే ఉంది. అలాగే సమ్మక్క సారక్క జాతర, పుష్కరాలు వంటి సందర్భాల్లోనూ ప్రయాణీకులు 50 శాతం అదనంగా చెల్లించి, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఈ సీజన్న అతిపెద్ద ఆర్థిక వనరుగా ఆర్టీసీ వినియోగించుకొనేది. దీనిపై క్షుణ్ణంగా పరిశీలన చేసిన టీఎస్ఆర్టీసీ ఎమీ సజ్జనార్ ప్రయాణీకులపై వేస్తున్న 50 శాతం భారాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీనిపై క్షుణ్ణంగా అన్ని అంశాలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే చౌకైన, భద్రతతో కూడిన రవాణాను అందించాలనీ, దానివల్ల ఆక్యుపెన్సీ రేషియో పెరిగి ఆదాయం అదే వస్తుందని ఆయన భావించినట్టు సమాచారం. పండుగల సీజన్లో అదనపు చార్జీల వసూళ్లపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏటా వచ్చేది. ఇప్పుడు దీన్ని ఎత్తిచేయడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఐదు రోజుల్లో ఆర్టీసీ ద్వారా 1.3 కోట్ల మంది ప్రయాణీకుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు సజ్జనార్ తెలిపారు. 50 శాతం అదనపు చార్జీల రద్దును ప్రయాణీకులు వినియోగించుకోవాలనీ, రోజువారీ చార్జీలు చెల్లించే పండుగకు ఊళ్లకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. టీఎస్ఆర్టీసీ రసరాకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణీకుల సౌకర్యార్థం 4వేలకు పైగా బస్సులను షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. బస్సుల వివరాలు తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా కొలెసెంటర్ ను ఏర్పాటు చేశారు. టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-68153333, 040-30102829లో సంప్రదించాలని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎస్ వీసీ సజ్జనార్ తెలిపారు. అలాగే హైదరాబాద్ నుంచి బయల్దేరే బస్సుల వివరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ బస్టేషన్ (ఎమ్ఎస్ 9959226257, జూబ్లీ బస్టాండ్ 9959226246, రెతిఫైల్ బస్టేషన్ 9959226154 నెంబర్లు సంప్రదించండి.

Post a Comment

0Comments

Post a Comment (0)