మంచి నీళ్లలో మత్తుమందు కలిపి...!

Telugu Lo Computer
0


నిందితులు మొదట ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ ద్వారా బాధితులతో స్నేహం చేసి, తర్వాత వారిని తమ ఇంటికి రప్పించుకుంటారు. అలా వచ్చిన వారికి మత్తుమందు కలిపిన నీరు లేదా కూల్‌డ్రింక్స్‌ ఇస్తారు. అది తాగి స్పృహ కోల్పోయిన తరువాత వారిని మహిళతో చనువుగా ఉన్నట్లు ఫోటోలు తీయడంతో పాటు ​అభ్యంతకరమైన ఫోటోలు తీసి బెదిరింపుల పర్వాన్ని మొదలుపెడతారు. ఈ తరహాలోనే ఇటీవల ఓ వ్యాపారికి ప్లై బోర్డు కావాలని ఓ మహిళ నుంచి కాల్ వచ్చింది. దీంతో అతను అక్టోబర్ 21న జనక్‌పురి ప్రాంతంలోని నిందితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తాగడానికి ఒక గ్లాసు మంచినీరు ఇవ్వగా దాన్ని తాగిన వెంటనే అతను స్పృహతప్పి పడిపోయాడు. వ్యాపారి స్పృహలోకి వచ్చినప్పుడు నగ్నంగా మంచం మీద ఉన్నాడు. కళ్లు తెరచి చూడగా చూట్టూ ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు అతనిపై దాడి చేసి, తన వద్ద ఉన్న సుమారు 16 వేల రూపాయల నగదు, చేతి గడియారం, బంగారు ఉంగరం లాక్కున్నారు. అంతే కాకుండా మరో రూ.7 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి తాము కొన్ని ఫైళ్లు, డబ్బు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. గత రెండేళ్లలో ఈ ముఠా దాదాపు 40 మంది పురుషుల నుంచి విలువైన వస్తువులను తీసుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)