అవమానాల్ని ఆపండి : సుధా చంద్రన్‌

Telugu Lo Computer
0

 

కృత్రిమ అవయవదారులకు మన దేశంలోని విమానాశ్రయాల్లో తీవ్ర అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రముఖ నర్తకి, నటి సుధా చంద్రన్‌ (56) ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేసి తనిఖీల పేరుతో అధికారుల నుంచి ఎదురయ్యే వేధింపులకు ముగింపు పలకాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ వీడియోను ఆమె పోస్టు చేశారు. వృత్తి రీత్యా విమానాల్లో తరచూ ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. కృత్రిమ అవయవాల్లో పేలుడు పదార్థాల వంటివి తీసుకొస్తారనే అనుమానం ఉంటుంది కనుక సంబంధిత తనిఖీలు చేసుకోవడంలో అభ్యంతరం లేదన్నారు. అయితే, విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేపట్టే ప్రతిసారీ తన కృత్రిమ కాలును తొలగించి చూపించాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇది తనలాంటి వారికి ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు అయిన మహిళలకు ఎంతో ఇబ్బందికరమని సుధా చంద్రన్‌ వివరించారు. సమస్యను ప్రధాన మంత్రితో పాటు కేంద్ర, రాష్ట్రాల అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వీడియోను పోస్టు చేస్తున్నట్లు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)