డేరాబాబా దోషి : సీబీఐ కోర్టు

Telugu Lo Computer
0

 


రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌సింగ్‌ (డేరా బాబా)ను హరియానా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. గతంలో ఆయన ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్‌ 2002, జులై 10న హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో సీబీఐ ప్రత్యే కోర్టు డేరా బాబాతోపాటు మరో నలుగురిని దోషులుగా తేల్చింది. అక్టోబర్ 12న దోషులందరికీ శిక్షలు ఖరారు చేయనుంది. కాగా, డేరాబాబా ఇప్పటికే ఆశ్రమంలోని ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)