జేమ్స్‌ సంగ్మాకు పెటా అవార్డ్‌

Telugu Lo Computer
0

 

మేఘాలయ పర్యావరణ, అటవీశాఖ మంత్రి జేమ్స్‌ సంగ్మా ను 'ప్రొగ్రెసివ్‌ బిజినెస్‌ కాన్సెప్ట్‌' విజేతగా జంతుహక్కుల పరిరక్షణ సంస్థ (పెటా) ప్రకటించింది. జంతువులను వధించకుండా పైనాపిల్‌ లెదర్‌ (తోలు)ను ప్రోత్సహించినందుకు గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు పెటా అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ లెదర్‌ ఉత్పత్తిని పెంచేందుకు రైతులను పైనాపిల్‌ తోటలను పెంచే దిశగా ప్రోత్సహించారని ఆ ప్రకటనలో పేర్కొంది. వాతావరణ మార్పులపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక మ్యూజియం, విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చేందుకు సంగ్మా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. దేశంలోని మొత్తం ఫైనాపిల్‌ ఉత్పత్తిలో 8 శాతం మేఘాలయ నుండి వస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ హార్టికల్చరల్‌ సైన్స్‌ వెల్లడించింది. జంతువులను వధించకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫ్యాషన్‌ డిజైన్‌ కంపెనీలు అవలంబిస్తున్న సరికొత్త ఉత్పత్తి అయిన ఫైనాపిల్‌ లెదర్‌ను వినియోగిస్తున్నారు. ఇది జంతువుల చర్మంలాగే ధృఢంగా, మన్నికగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణ సంక్షోభం దేశానికి అతి పెద్ద సవాలుగా నిలిచిందని సంగ్మా గుర్తించారు. జంతువులను చంపకుండా వ్యవసాయం ద్వారా పరిష్కరించడానికి చర్యలు చేపట్టారని పెటా భారత సీనియర్‌ ప్రచారాల సమన్వయ కర్త రాధికా సూర్యవంశీ పేర్కొన్నారు. ఫైనాపిల్‌ లెదర్‌ పరిశ్రమ ద్వారా రైతులకు నూతన అవకాశాలను అందించడమే కాకుండా పర్యావరణ, జంతువుల సంరక్షణ చేపట్టారని అన్నారు. అలాగే జంతు చర్మ శుద్ధి ప్రక్రియలో వినియోగించే క్రోమియం రసాయనంతో పలువురు కార్మికులు క్యాన్సర్‌ బారిన పడుతున్నారని పెటా వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)