తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన మోదీ

Telugu Lo Computer
0


మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్​నగర్​లో తొమ్మిది మెడికల్ కాలేజీలను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​,గవర్నర్ ఆనందిబెన్ పటేల్, కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవియా పాల్గొన్నారు. సిద్ధార్థ్​నగర్​, ఈటాహ్​, హర్దోయ్​, ప్రతాప్​గఢ్​, ఫతేపుర్​, దేవరియా, మీర్జాపుర్​, జౌన్​పుర్​ జిల్లాలో రూ. 2,329కోట్ల వ్యయంతో ఈ 9 మెడికల్ కాలేజీలను నిర్మించారు. ఆరోగ్య నిపుణులు, మెడికల్ కాలేజీల పెంపు, జిల్లా హాస్పిటల్స్ లోని మౌలికవసతులను సమర్థవంతంగా ఉపయోగించేందుకు చేపట్టిన కేంద్ర పథకం ద్వారా 8 కళాశాలను ఏర్పాటు చేశారు. జౌన్​పుర్​లోని వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులతో నిర్మించుకుంది. ఈ సందర్భంగా బహిరంగ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సొంత కుటుంబాల ఖజానాలు నింపుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు తహతహలాడాయి. తమ ప్రభుత్వం మాత్రం పేదల డబ్బును పొదుపు చేసి వారికి మంచి వసతులు కల్పించే దిశగా అడుగులు వేసింది. గత ప్రభుత్వాలు పూర్వాంచల్ ను నాశనం చేశాయి. మా ప్రభుత్వం ఇప్పుడు అక్కడి ప్రజల జీవితాల్లో ఆశలు నింపుతోంది. యూపీలో వైద్య వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అనేది పార్లమెంట్​ వేదికగా యోగి ఆదిత్యనాథ్​ బయటపెట్టారు. ఆయన కృషిని ప్రజలు మర్చిపోలేరు. ఈ మెడికల్ కాలేజీల వల్ల 2500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. 5వేల మందికి ఉపాధి లభించింది. పూర్వాంచల్​ను గత ప్రభుత్వాలు వ్యాధుల పుట్టగా మార్చేశాయి. కానీ ఇప్పుడు కథ మారుతుంది. ఉత్తర భారతానికే మెడికల్​ హబ్​గా పూర్వాంచల్​ను తీర్చిదుద్దుతామని మోదీ అన్నారు. ఏకకాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించడం చిన్న విషయం కాదని, వర్ధమాన, భవిష్యత్తు తరాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవియా అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)