ఫోన్‌తో కార్‌డోర్ ఓపెన్ చేయొచ్చు

Telugu Lo Computer
0
ఇండియన్ మార్కెట్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో ఒక్కటైన శామ్‌సంగ్ త్వరలో మరో కొత్త ఆవిష్కరణను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టనుంది. అదే డిజిటల్ కార్ కీ. అల్ట్రా-వైడ్‌బ్యాండ్ (యుడబ్ల్యుబీ), నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సి)-ఎనేబుల్డ్ డిజిటల్ కార్ కీస్‌కు త్వరలోనే శాంసంగ్‌ ఆవిష్కరించనుంది. ఈ డిజిటల్‌ 'కీ' స్‌ తొలుత దక్షిణ కొరియా ప్రవేశపెట్టాలని శామ్‌సంగ్ భావిస్తోంది. అన్ని ఎలక్ట్రిక్ జెనెసిస్ జివి 60 కార్లకు శాంసంగ్‌ కీస్‌ను తయారుచేయనుంది. దీనికి సంబంధించి అమెరికన్ టెక్ బ్లాక్ The Verge ట్విట్టర్‌లో ప్రకటించింది. శామ్‌సంగ్ ప్రవేశ పెడుతున్న ఈ డిజిటల్ కీ ప్రస్తుతం కొన్ని కార్లకే పరిమితం ప్రస్తుతం శాంసంగ్‌ కేవలం జెనెసిస్ జివి 60 కార్లకే మాత్రమే డిజిటల్‌ కీస్‌ పనిచేయనున్నాయి. ఆడి, బిఎమ్‌డబ్ల్యూ , ఫోర్డ్‌ వంటి దిగ్గజ ఆటో మొబైల్‌ కంపెనీలతో శామ్‌సంగ్ భాగస్వామ్యాన్ని కల్గిఉంది. భవిష్యత్తులో భారీ ఎత్తున్న ఆటోమొబైల్‌ కంపెనీలకు ఎన్‌ఎఫ్‌సీ డిజిటల్‌ కీస్‌ను తయారుచేసేందుకు శాంసంగ్‌ సన్నాహాలను చేస్తోంది. అంతే కాకుండా డిజిటల్ కీలు శామ్‌సంగ్ పాస్‌ యాప్‌లో భద్రంగా నిల్వ ఉంటాయని సంస్థ చెబుతోంది. ఫోన్‌లో ఉన్న ఎంబెడెడ్ సెక్యూర్ ఎలిమెంట్ (ఇఎస్‌ఇ)" ద్వారా డిజిటల్‌ కీస్‌ను రక్షిస్తాయని శామ్‌సంగ్‌ టెక్ వర్గాలు చెబుతున్నాయి. శామ్‌సంగ్ ఇప్పటికే గెలాక్సీ ఎస్ 21 లాంచ్ సమయంలో తన ఫోన్‌లలో డిజిటల్ కార్ కీస్‌ కోసం ప్రణాళికలను ప్రకటించిన విషయం మనకు తెలుసు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పలు శాంసంగ్‌ మోడళ్లలో తెచ్చేందుకు శాంసంగ్‌ ప్రయత్నాలను చేస్తోంది. ది వెర్జ్ కథనం ప్రకారం, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ , శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 21 అల్ట్రా, నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, ఫోల్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్స్‌ యుడబ్ల్యుబి సాంకేతికతను మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో పలు ఎలక్ట్రానిక్‌ వాహనాలను కీస్‌ లేకుండా ఈ స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించి స్టార్ట్‌ చేయవచ్చును. ఈ టెక్నాలజీ సహాయంతో కార్‌ విండోస్‌ను కూడా ఆపరేట్‌ చేయవచ్చును. భవిష్యత్‌లో శామ్‌సంగ్ అన్ని మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)