కాటేసిన పాముతో ఆస్పత్రికి...!

Telugu Lo Computer
0


కర్ణాటక రాష్ట్రం లోని డెంకణీకోట తాలూకా బయలకాడు గ్రామానికి చెందిన మణి కూతురు ఐదేళ్ల సంచనశ్రీ ఇంటి ముందు ఆడుకుంటుండగా చిన్న సైజు కట్ల పాము కాటు వేసింది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. వెంటనే పామును కొట్టి సంచిలో వేసుకొని చిన్నారిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపను ఇదే పాము కాటేసిందని వైద్యులకు చూపించారు. మహిళ చేతిలోని పామును చూసి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు. కానీ, సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో చిన్నారిని రక్షించగలిగామని డాక్టర్లు తెలిపారు. కాటేసిన పాము ఏదో తెలిస్తే.. వైద్యం చేయడం సులభమవుతోంది. అందుకే అలా పామును తీసుకొచ్చినట్లు మణి తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)