రైల్వే ఉద్యోగులకు బోనస్‌ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 6 October 2021

రైల్వే ఉద్యోగులకు బోనస్‌

రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు బోనస్‌ సహా పలు అంశాలను ఈ భేటీలో చర్చించారు. కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, పీయూష్‌ గోయాల్‌ మీడియా సమావేశంలో కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.

No comments:

Post a Comment

Post Top Ad