యాపిల్ యూజర్లకు బంపరాఫర్

Telugu Lo Computer
0


ఇటీవల కాలంలో ఈ-వాలెట్లు, ఆన్ లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే  లాంటి డిజిటల్ చెల్లింపులవేదికలు అందుబాటులో ఉన్నాయి. టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కూడా ఈ జాబితాలో చేరింది. యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ను ఉపయోగించి చెల్లింపులను ప్రోత్సహించేందుకు గాను బోనస్ ను అందిస్తోంది.భారతీయ వినియోగదారులు యాపిల్ ఐడీకి డబ్బు యాడ్ చేయడం వల్ల 20 శాతం బోనస్ ను అందుకుంటారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఇండియన్స్ యాపిల్ ఐడీకి ఫండ్స్ యాడ్ చేస్తే 20 శాతం బోనస్ అందుకుంటారని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ అక్టోబరు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, యాపిల్ ఐడీ బ్యాలెన్స్ కు రూ.100నుంచి రూ.15 వేల వరకు డబ్బు యాడ్ చేసినప్పుడు ఈ బోనస్ వర్తిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా వినియోగదారు వారి యాపిల్ ఐడికి రూ.2 వేలు జోడిస్తే వారురూ.400బోనస్​గాపొందుతారు. అదే రూ.10 వేలు యాడ్​ చేస్తే రూ.2 వేలు బోనస్ గా అందుకుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)