తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు

Telugu Lo Computer
0


మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా కొనసాగిన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్ ఆర్కే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 14న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. కిడ్నీలు విఫలవ్వడం ఆయనకు చికిత్స అందించామని, అయినా కూడా కాపాడుకోలేకపోయామని మావోయస్టు పార్టీ తెలిపింది. సీనియర్ నేత ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ శనివారం నాడు విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దును ఆనుకుని ఉండే పామేడు-కొండపల్లి (ఛత్తీస్ గఢ్) వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే అంత్యక్రియలు పూర్తయ్యాయి. అగ్రనేత అంత్యక్రియలకు మావోయస్టు శ్రేణులతోపాటు సాధారణ జనం కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించిన మావోయిస్టులు.. పార్టీ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. గుంటూరు జిల్లా పల్నాడు ఆయన స్వస్థలం. తల్లి, కుటుంబీకులు చివరిసారి చూసుకునేందుకు వీలుగా హరగోపాల్ మృతదేహం ఫొటోలను విడుదల చేసినందుకు ఆయన సోదరి పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)