స్విమ్మింగ్ లో మాధవన్ కొడుకు రికార్డులు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 26 October 2021

స్విమ్మింగ్ లో మాధవన్ కొడుకు రికార్డులు !

 

ప్రముఖ నటుడు మాధవన్‌ తనయుడు వేదాంత్‌ #స్విమ్మింగ్‌ పోటీల్లో అదరగొట్టాడు. ఇటీవల బెంగళూరులోని బసవనగుడి అక్వాటిక్‌ సెంటర్‌లో ‘జూనియర్‌ నేషనల్‌ స్విమ్మింగ్‌ అక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్స్‌ 2021’ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 16 ఏళ్ల వేదాంత్‌ 7 పతకాలతో సత్తాచాటాడు. వీటిలో 800 మీటర్ల ఫ్రీస్టైల్‌, 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌, 4X100 ఫ్రీస్టైల్‌ రిలే, 4X200 ఫ్రీస్టైల్‌ రిలేలో రజత పతకాలు, 100, 200, 400 మీటర్ల ఫ్రీస్టైల్‌ పోటీల్లో కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ పోటీల్లో 7 పతకాలు సాధించడం పట్ల కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ ట్వీట్‌ చేశారు. ‘‘గుడ్‌ జాబ్‌ వేదాంత్‌. మీ ప్రదర్శన పట్ల గర్విస్తున్నాం’’ అని పేర్కొన్నారు. పలువురు నెటిజెన్లు వేదాంత్‌, మాధవన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ పోటీల్లో వేదాంత్‌ మహారాష్ట్రకి ప్రాతినిథ్యం వహించారు. గత మార్చిలో జరిగిన లాత్వియన్‌ ఓపెన్‌ స్విమ్మింగ్‌  ఛాంపియన్‌షిప్‌లో వేదాంత్‌ కాంస్యంతో మెరిశాడు.

No comments:

Post a Comment