కళ్ళ కింద వాపు వస్తుందా !

Telugu Lo Computer
0

 

ఎక్కువ సమయం కంప్యూటర్ పని చేసేవాళ్ళలోనూ, ఎప్పుడూ క్లాస్ రూమ్ లో పుస్తకాలతో కుస్తీ పట్టేవాళ్ళలోనూ, అస్తమానం ఫోన్ అదేపనిగా చూసి వాళ్లలోనూ, కళ్లకు ఎక్కువ శ్రమ తప్పని వాళ్ళలోనూ తరచుగా కళ్ళకింద వలయాలు, వాపు వచ్చే అవకాశం ఉంది. వీటిని నివారించడానికి ఇంట్లోనే సొంతంగా చేసుకోగలిగిన కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలను మీరు ఉదయం కానీ పడుకునే ముందు గానీ ప్రయత్నించవచ్చు. 

* ఒక టీ స్పూన్ ఉప్పు లో కొద్దిగా వేడినీటిని కలిపి అందులో కాటన్ ప్యాడ్ ని కానీ కాటన్ క్లాత్ ను కానీ ముంచి కళ్ళ మీద పెట్టాలి. ఇలా చేయడం వలన అలసిన కళ్ళకు స్వాంతన కలిగిస్తుంది.

* కోడిగుడ్డులోని తెల్లసొనను ఒక కప్పు లోకి తీసుకుని దానిని బాగా గిలకొట్టి కొండ చుట్టూ రాయాలి. ఇలా రాసిన తర్వాత కొంతసేపటికి ఆరిపోయి స్కిన్ టైట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో కడగాలి ఇలా చేస్తూ ఉంటే కళ్లకింద చర్మం సాగినట్లు ఉండటం వాపు వంటివి తగ్గుతాయి. * సాధారణంగా చాలా రకాల ఫేషియల్ ప్యాక్ లకు కళ్లచుట్టూ ఉన్న చర్మం నిర్వహించాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)