ప్రియురాలు పని చేసే చోట దొంగతనం చేసి....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 13 October 2021

ప్రియురాలు పని చేసే చోట దొంగతనం చేసి....!



ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తికి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ఈ అమ్మాయి ఎనిమిది సంవత్సరాలుగా ఓ వృద్ధురాలి ఇంట్లో పనిచేస్తోంది. దీంతో తన ప్రియురాలిని కలవడానికి ఆ వ్యక్తి అప్పుడప్పుడు వృద్ధురాలి ఇంటికి వెళ్లేవాడు. అలా వెళ్లిన ప్రతీసారి ఆ యువకుడు కన్ను ఆ మహిళ ఒంటిపై ఉన్న నగలపై పడింది. అలా ఓ రోజు తన ప్రియురాలు ఆ ఇంట్లో లేదని తెలుసుకున్నాడు. అదే అదునుగా భావించి తన స్నేహితునితో కలిసి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె అరవకుండా నోట్లో గుడ్డ కుక్కి నగలు, నగదును దోచుకున్నారు. ఆ ఇంట్లోకి వచ్చిన ప్రియురాలు కూడా ఎవరో దొంగలు వచ్చారే అనుకుంది. ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా విచారణలో వారు.. ఈ దోపిడీ తరువాత, నేరుగా ఉజ్జయినికి వెళ్లామని, అక్కడ బాబా మహాకల్‌ను దర్శనం చేసుకుని క్షమాపణ చెప్పడంతో పాటు అక్కడ దానధర్మాలు కూడా చేసినట్లు పోలీసులకు తెలిపారు. అయితే, ఈ ఘటన గురించి ఆ బాలికకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad