వెంట ఫోన్ ఉండాల్సిందే...!

Telugu Lo Computer
0

 

ఆన్ లైన్ మోసాలు పెరిగిపోవడంతో బ్యాంకులు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకువస్తున్నాయి. ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునేందుకు ఓటీపీ తప్పనిసరి చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు వన్ టైం పాస్ వర్డ్ ప్రవేశపెట్టడం ద్వారా ఖాతాదారులు మోసకారుల చేతిలో పడకుండా భద్రంగా ఉంటారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలో ఎప్పటి మాదిరిగానే పిన్ ఎంటర్ చేసిన తరవాత, ఖాతాదారుడి ఫోన్ కు ఓటీపీ వస్తుంది. అది కూడా ఎంటర్ చేస్తేనే నగదు తీసుకోవడం వీలవుతుంది. దీని ద్వారా ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడవచ్చని బ్యాంకు భావిస్తోంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లో ఓటీపీ ఆధారిత ఏటీఎం ట్రాన్సాక్షన్ విధానం తీసుకువచ్చింది. తాజాగా దీన్ని మరింత మెరుగుపర్చి ఓటీపీ ఆధారిత నగదు విత్ డ్రా విధానం ప్రవేశ పెట్టింటి. ఏటీఎం ద్వారా క్యాష్ తీసుకునే ఖాతాదారుడు బ్యాంకులో నమోదు చేసుకున్న ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ నెంబరు ఎంటర్ చేస్తేనే ఏటీఎం నుంచి నగదు వస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆన్ లైన్ మోసగాళ్ల నుంచి ఖాతాదారులను కాపాడేందుకు ఈ విధానం తీసుకువచ్చినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఆ పోస్ట్ లో తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)