హైటెక్స్‌లో తెరాస ప్లీనరీ సందడి

Telugu Lo Computer
0



హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో తెరాస రాష్ట్ర ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ) ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరై తెరాస జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న సభకు అనుమతి ఉన్న ప్రతినిధులతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో హైటెక్స్‌లో సందడి నెలకొంది. సభా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గులాబీ రంగు చొక్కాలేని వారికి వేదికపైకి అనుమతి లేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో కొందరు ఆ రంగు చొక్కాలు ధరించి వేదిక వద్దకు చేరుకున్నారు. ప్లీనరీలో భాగంగా తెరాస ఇవాళ ఏడు తీర్మానాలు చేయనుంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఎన్నిక లాంఛనం కానున్న విషయం తెలిసిందే. సీఎంతో పాటు ప్రజాప్రతినిధులు హాజరైన నేపథ్యంలో హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకూ ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)