ప్రకృతి..! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 28 October 2021

ప్రకృతి..!


జాన్ గాడ్ అనే వ్యక్తి ఒక బ్యాంకు స్థాపించాడు. ఇందులో అందరూ మెంబర్లు కావచ్చు. ప్రవేశం ఉచితం. మీ అకౌంట్లో ప్రతి రోజూ 86400  జమ చేయబడుతుంది. మీ ఓపిక పట్టి ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే ఒక విషయం..!! బద్దకంతో గానీ, నిద్రపోయి గానీ మీరు కొంత ఖర్చు పెట్టకపొతే, ఆ మిగిలినదంతా మరుసటి రోజుకి ’మైనస్’ అయిపోతుంది. ఈ రోజు ‘అదా చేసి’ తరువాత ఖర్చు పెట్టుకుంటానూ అంటే కుదరదు.  మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ ఎనభై ఆరువేల నాలుగు వందలు జమ చేయబడతాయి. దీన్ని ఇంకొకరి పేరు మీద ట్రాన్స్ ఫర్ చేయటానికి వీలు ఉండదు. ఎందుకంటే బ్యాంకు వారు ఎపుడైనా సరే ‘…నేటితో మీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాము’ అని నోటీసు ఇవ్వకుండానే చెప్పవచ్చు. వారసత్వం ప్రసక్తే లేదు. దీంట్లో మీరు మెంబర్ అయితే ఏం చేస్తారు? మీరు మరింత ఆనందంగా ఉండటం కోసం... మీరు ప్రేమించే వాళ్ళ కోసం... మరింత లాభదాయకంగా ఖర్చు పెట్టటానికి ప్రయత్నిస్తారు. మరింత   ఫలవంతంగా ఎలా ఖర్చుపెట్టాలా అని ఆలోచిస్తారు..! ఎందుకంటే మరుసటి రోజు పొద్దున్నకి దాని విలువ సున్నా అయిపోతుంది కాబట్టి. అంతే కదా..! నిజంగా ఇలాంటి బ్యాంకు ఉంది, నమ్మకం కలగటం లేదా? అవును, నిజంగానే ఉంది. ఈ బ్యాంకుని సృష్టించి, రోజుకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు మీ అకౌంట్లో వేసేది ప్రకృతి..! మీరు వాడుకోని సమయం అంతా వృథా. పైగా మరణంతో అకౌంటు క్లోజ్ అయిపోతుంది. మీరు ఎంత ధనవంతులో ఆలోచించండి..! జీవితంలో విజయం సాధించాలంటే అన్నిటి కన్నా మొదటగా కావలసింది 'సమయం' విలువ గ్రహించటం ఈ విషయం గ్రహించి, ప్రతి క్షణాన్నీ ఆనందం కోసమో, ఆర్థిక లాభం కోసమో, చుట్టూ ఉన్న అనాధల కోసమో, ఆత్మీయుల ప్రేమ కోసమో ఖర్చు పెట్టిననాడు, మీరు విజయం సాధించినట్టే. 

No comments:

Post a Comment