యాసంగిలో వరి వద్దు

Telugu Lo Computer
0


యాసంగిలో వరి పంట వద్దు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని తెలంగాణ  మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, సహకార శాఖ, పోలీస్ శాఖల అధికారులు, మిల్లర్లతో మంత్రి యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు,వానాకాలం ధాన్యం కొను గోలు పై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో కుడా రైతు కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేసిందని, క్షేత్ర స్థాయిలో ధాన్యం సేకరణలో కృషి చేసిన అన్ని శాఖల అధికారులను మంత్రి అభినందించారు. వచ్చే యాసంగిలో వరి కొనుగోలు చేసే పరిస్థితి లేదని, కేంద్రం స్పష్టం చేసినందున రైతులను మార్కెట్ లో ధర లభించే వరికి బదులు ఇతర పంటలను వేసేలా రైతులను చైతన్య వంతం చెయాలని మంత్రి సూచించారు. యాసంగిలో ఒక్క గింజ కొనే పరిస్థితి లేదని, వ్యవసాయ అధికారులు ప్రతి రోజు గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు మండల వ్యవసాయ అధికారులు, పంటల సాగుపై ప్రణాళికలను తయారు చేసి, రైతులు యాసంగి సీజన్ లో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్, మినుములు, శనగ, వేరుశనగ, ఆముదం, నువ్వులు, పెసర, తదితర పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. మినుములు మద్దతు ధరకు నాఫెడ్ సంస్థ కొనుగోలు చేస్తుందని, మినుములు పంట సాగు ప్రోత్సహించాలన్నారు. వానాకాలం పంట కొనుగోలుపై రైతులకు టోకెన్ లు జారీ చేసి క్రమ బద్దీకరణ చేయాలని అన్నారు. అదేవిధంగా కూరగాయలు పండించేలా ప్రోత్సహించాలని, ఉద్యానవన అధికారులను కోరారుసమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డి.ఐ. జి.ఏ. వి.రంగ నాథ్, అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, ఎన్. భాస్కర్ రావు ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాం చంద్ర నాయక్, మున్సిపల్ కమిషనర్ సైది రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారిని సంగీత లక్ష్మి, జిల్లా సహకార అధికారి ప్రసాద్, పౌర సరఫరాల డీఎం నాగేశ్వరరావు, మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)