పెళ్లి రిసెప్షన్ లో కలుసుకున్న చిరు, పవన్

Telugu Lo Computer
0

 

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ నిన్న ఓ పెళ్లి వేడుకలో కలిసి అందరిని కనువిందు చేశారు. మాజీ మంత్రి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకటరామ్ మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్ లోనీ ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో జరిగింది. అయితే ఈ మ్యారేజ్ రిసెప్షన్ కు మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ సమయంలో ఈ మెగా బ్రదర్స్ నవ్వుతూ పలకరించుకున్నారు. మెగా బ్రదర్స్ రాకతో పెళ్లి ఫంక్షన్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. అనంతరం మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిసి వధూవరులు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. అయితే అంతకు ముందు పవన్ కళ్యాన్… తన అన్నయ్య చిరంజీవి చేతిలో చేయి వేసి నవ్వుతూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)