కొనసాగుతున్న శరన్నవరాత్రులు ఏర్పాట్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 2 October 2021

కొనసాగుతున్న శరన్నవరాత్రులు ఏర్పాట్లు


ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ విజయవాడ ఇంద్రకీలాద్రీపై కొలువైున కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు జరగబోతున్నాయి. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా భారీగా భక్తులు దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే భవానీ మాల ధారులు కూడా భారీ సంఖ్యలో రానున్నారు. అసలే కరోనా సమయం కావడంతో వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనాలు పూర్తి చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం కొన్ని ఆంక్షలు కూడా విధిస్తున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతీ రోజూ 10 వేల మందిని మాత్రమే అనుమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని చెప్తున్నారు. ఆఫ్ లైన్ లోనూ టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈసారి భవానీ మాలధారులు ఇరుముడుల సమర్పణకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని అధికారులు ప్రకటించారు.

No comments:

Post a Comment

Post Top Ad