సుప్రీం తీర్పు హర్షణీయం : సీపీఐ(ఎం)

Telugu Lo Computer
0


పెగాసెస్‌ స్పైవేర్‌ ద్వారా దేశవ్యాపితంగా అనేక మంది పాత్రికేయులు, రాజకీయ నాయకులు, వివిధ సంస్థల ముఖ్యుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసి రాజ్యాంగ కల్పించిన వ్యక్తిగత గోప్యతను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. ఈ విషయంపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినప్పటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకుండా ముఖం చాటేసింది. దేశ వ్యాపితంగా అనేక ఆందోళనలు జరిగినప్పటికీ ఖాతరు చేయలేదు. పెగాసెస్‌పై సుప్రీంకోర్టు వివరణ కోరినప్పటికీ దేశ భద్రతను సాకుగా చూపి సుప్రీంకోర్టులో వాస్తవ సమాచారం ఇవ్వకుండా తప్పించుకోచూసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరికొందరితో నిపుణుల కమిటీ వేసి ఎనిమిది వారాల్లో ఈ విషయాన్ని నిగ్గు తేల్చి రిపోర్టు ఇవ్వాలని తీర్పు ఇవ్వడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆహ్వానిస్తున్నది. బీజేపీ అధికారానికొచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో రాజ్యాంగ ఉల్లంఘనలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో దొడ్డిదారుల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఫెడరల్‌ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ ఇజ్రాయిల్‌ ఐటీ సంస్థ ద్వారా గూఢచర్యకు పాల్పడుతున్నది. ఇది దేశ భద్రతకే ముప్పు. దీన్ని చాలా దేశాలు వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. పెగాసెస్‌ ద్వారా ప్రజల గోప్యతను ఉల్లంఘించినందున దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నది. నిపుణుల కమిటీ తన విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతున్నది. 

Post a Comment

0Comments

Post a Comment (0)