కేరళలో వరద బీభత్సం

Telugu Lo Computer
0


కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇడుక్కి జిల్లాలోని తోడుపుళలో వరదల కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. రూరల్ కొట్టాయంలో కొండ చరియలు విరిగిపడి 12 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకోలేకపోవడంతో గాలింపు చర్యలు ముందుకు సాగడం లేదు. దీంతో సహాయక చర్యల కోసం వాయసేన సాయాన్ని కేరళ ప్రభుత్వం అర్థించింది. కొండచరియలు కారణంగా ఎక్కువగా ప్రమాదాలు సంభివిస్తున్న కొట్టాయం జిల్లాలోని కూటికల్‌లో సహాయ చర్యల కోసం వైమానిక సాయాన్ని కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కొట్టాయం జిల్లాలో కొండ చరియలు విరిగిపడడంతో మూడు ఇళ్లు ధ్వంసం కాగా, పదిమంది గల్లంతయ్యారు. జిల్లాలో నాలుగు చోట్ల కూడా కొండచరియలు విరిగిపడినట్టు అధికారులు చెబుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో 60 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా కొట్టాయం, పతనమ్‌థిట్ట జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. పతనమ్‌థిట్టలోని కక్కి డ్యామ్, త్రిసూర్‌లోని షోలాయర్, ఇడుక్కిలోని కుందాల, కల్లరకుట్టి డ్యామ్‌ల వద్ద రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అలాగే, రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)