ఆఫర్ ను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 24 October 2021

ఆఫర్ ను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్

 


జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "ఎవరు మీలో కోటీశ్వరులు" అనే టాక్ షో త్వరలో పూర్తి కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం మరొక సీజన్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ని మళ్లీ తరువాత  సీజన్ కి కూడా హోస్ట్ గా రమ్మని సంప్రదించారు. భారీ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఈ ఆఫర్ కి ససేమిరా ఒప్పుకోలేదట. ఒకప్పుడు చానల్స్ లో నెంబర్ వన్ గా ఉండే జెమినీ టీవీ ఇప్పుడు మా టీవీ, జీ టీవీ మరియు ఈ టీవీ తర్వాత నాలుగవ స్థానాన్ని తీసుకుంది. అందుకే రేటింగ్ ని పెంచుకోవటానికి "ఎవరు మీలో కోటీశ్వరులు" మరియు "మాస్టర్ చెఫ్" ప్రోగ్రాం లను మొదలుపెట్టింది జెమిని టివి. కానీ ఈ రెండు ప్రోగ్రామ్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ని  సెకండ్ సీజన్ కోసం కూడా హోస్ట్ గా తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇక ఈ ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరించడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొన్నాళ్లపాటు టీవీ షో లకి గ్యాప్ ఇచ్చి సినిమాల మీద మళ్లీ ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. "జనతా గ్యారేజ్" సినిమా తర్వాత ఎన్టీఆర్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది.

No comments:

Post a Comment