చార్ ధామ్ సందర్శకులు పరిమితి ఎత్తివేత

Telugu Lo Computer
0

 


చార్ ధామ్ సందర్శించే వారి రోజువారీ పరిమితిని ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. చార్ ధామ్‌కు వచ్చే వారి సంఖ్యపై రోజువారీ పరిమితిని తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు మంగళవారం పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. జస్టిస్ ఆర్‌సీ ఖుల్బే, జస్టిస్ అలోక్ కుమార్ డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం దాఖలు చేసిన సవరణ దరఖాస్తులో.. యాత్రాదారులపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని కోరింది. భక్తుల సంఖ్యపై పరిమితి ఉండటంలో చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై ప్రభావం చూపుతున్నదని తన పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే కరోనా పరీక్ష రిపోర్ట్‌, టీకా ధ్రువీకరణ పత్రాన్ని యాత్రికులు తప్పనిసరిగా సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మతో కూడిన కోర్టు డివిజన్ బెంచ్ కూడా ఆదేశించింది. దేవాలయాల చుట్టూ ఉన్న ఏ చెరువులోనూ భక్తులు స్నానం చేయడానికి అనుమతించకూడదని చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)