విష్ణు ప్రమాణ స్వీకారం

Telugu Lo Computer
0

 

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఫిలిం చాంబర్‌లో మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ అధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసి అనంతరం సంతకం చేశారు. ఆ తర్వాత గెలిచిన మిగతా కార్యవర్గ సభ్యులతో కూడా ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరు కాగా మోహన్‌ బాబు, పలువురు సినీ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)