అజిత్ ఇంటి ముందే ఆత్మహత్యయత్నం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 6 October 2021

అజిత్ ఇంటి ముందే ఆత్మహత్యయత్నం

తమిళ హీరో అజిత్ ఇంటి ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని తన చావుకి అజితే కారణమవుతాడని ఆరోపించింది. పోలీసులు వెంటనే స్పందించి ఆమెపై నీళ్లు పోసి రక్షించారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. గతేడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నటుడు అజిత్ భార్య షాలినితో కలిసి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో వెళ్లారు. అదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే ఫర్జానా అనే మహిళ వారిని ఆస్పత్రిలోనే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. కాగా కొందరు అజిత్ కరోనా బారిన పడ్డాడంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. దాంతో వీడియో తీసి పోస్ట్ చేసిన ఫర్జానాను హాస్పిటల్ రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించిందన్న కారణంతో ఉద్యోగంలో నుంచి తొలగించారు. అయితే అజిత్ ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడితే తన ఉద్యోగం తనకు వస్తుందనే ఆశతో ఆమె పలుమార్లు అజిత్ ను కలవడానికి ప్రయత్నించింది. కానీ కలవలేకపోయింది. దాంతో ఆమె తనకు న్యాయం చేయాలంటూ ఇప్పుడు అజిత్ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో పోలీసులు స్పందించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెని ఇంటికి పంపించేశారు.

No comments:

Post a Comment

Post Top Ad