నెక్స్‌ట్ లో ప్రగతి ఓఎస్

Telugu Lo Computer
0

 

జియో మరో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ ను విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఈ ఫోన్ లో అనేక అద్భుతమైన ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ ప్రగతి ఆపరేటింగి సిస్టమ్ పై పని చేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను గూగుల్, జియో కలిసి అభివృద్ధి చేశాయి. భారతీయ వినియోగదారులు అవసరాలను తీర్చడమే లక్ష్యంగా గూగుల్, జియో సంయుక్తంగా ఈ జియోఫోన్ ను అభివృద్ధి చేశాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సరికొత్త ఫీచర్లతో యూజర్లు మంచి అనుభూతిని ఇవ్వనుంది. గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న మిలియన్ల కొద్ది యాప్ లు ఈ ఆపరేటింగ్ సిస్టమపై పని చేస్తాయి. ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లు సైతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్నాయి.

* మాట్లాడడం ద్వారా ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు. (ఉదాహరణ: యాప్ లు ఓపెన్ చేయడం, సెట్టింగ్స్ మేనేజ్ చేయడం.) ఇంటర్నెట్ నుంచి సైతం సమాచారాన్ని కావాల్సిన భాషలో పొందొచ్చు.

* రీడ్ ఎలౌడ్ ఫీచర్ సహాయంతో యూజర్లు స్క్రీన్ పైన ఉన్న టెక్స్ట్ ను తమకు కావాల్సిన భాషలో చదివి వినిపించవచ్చు.

* ఇందులో ట్రాన్స్‌లేట్ నౌ అనే ఫీచర్ ఉంది. ఈ యాప్‌లో మొబైల్ స్క్రీన్ లేదా ఇమేజ్‌ను తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. 

* స్మార్ట్, పవర్ ఫుల్ కెమెరాను పొందుపర్చారు. పోట్రైట్ తో పాటు అనేక రకాల ఫొటోగ్రఫీ మోడ్స్ కు  ఇది సపోర్ట్ చేస్తుంది. ఆటోమోటిక్ బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్ ఫీచర్ ద్వారా యూజర్లు ఆకట్టుకునే ఫొటోలను పొందవచ్చు. నైడ్ మోడ్ ద్వారా లైట్ తక్కువగా ఉన్న సమయంలోనూ యూజర్లు మంచి ఫొటోలను తీయవచ్చు.

* గూగుల్ ప్లే స్టోర్ లోని మిలియన్ల కొద్ది యాప్ లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో గూగుల్, జియో యాప్స్ కు సంబంధించిన ప్రీ లోడ్ యాప్ లు ఉంటాయి.

* సెక్యూరిటీ, నూతన ఫీచర్లకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందించేలా ఓఎస్ ను తీర్చిదిద్దారు.

* నియర్ బై షేర్ ఫీచర్ ద్వారా ఇంటర్ నెట్ లేకుండానే యాప్స్, ఫైల్స్, ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ ను ఇతరులకు షేర్ చేయొచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)