వీధి వ్యాపారిని కాల్చి చంపిన టెర్రరిస్టులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 October 2021

వీధి వ్యాపారిని కాల్చి చంపిన టెర్రరిస్టులు

 


జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం ఓల్డ్ శ్రీనగర్​లోని ఈద్గా ప్రాంతంలో పానీపూరి అమ్మే ఓ వీధివర్తకుడిని ఉగ్రవాదులు కాల్చిచంపినన్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. మృతుడిని బీహార్ కు చెందిన అర్వింద్ కుమార్ షాగా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన మిలిటెంట్లను పట్టుకునేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అర్వింద్ కుమార్ షా హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ నేత,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. అరవింద్ కుమార్ చేసిందల్లా సంపాదన అవకాశాల కోసం శ్రీనగర్‌కు రావడమేనని ఒమర్ అబ్దుల్లా అన్నారు. శ్రీనగర్ లో పౌరులను టార్గెట్ చేసి చంపిన మరొక కేసు ఇదని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. శ్రీనగర్ లో మైనార్టీలైన హిందువులు,సిక్కులపై ఉగ్రవాదులు వరుసగా కాల్పులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. గత వారంలో మైనారిటీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఏరివేతను చేపట్టాయి బలగాలు. ఈ హత్యలకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను 24 గంటల వ్యవధిలో హతమార్చినట్లు పోలీసులు ప్రకటించిన రోజునే మళ్లీ దుశ్చర్యకు పాల్పడ్డారు. పుల్వామాలో మరో వీధివర్తకుడు సాగిర్ అహ్మద్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యూపీకి చెందిన సాగిర్ అహ్మద్ ను హాస్పిటల్ కు తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

No comments:

Post a Comment