పులిని చంపిన వేటగాళ్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 31 October 2021

పులిని చంపిన వేటగాళ్లు

 


పులిని చంపారన్న ఆరోపణలతో అరెస్టుకు వచ్చిన అధికారులపై దాడి జరిగింది. 10 మంది అనుమానితులను బలవంతంగా తీసుకెళ్తున్న వాహనాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. గ్రామస్తులను చేధించుకొని వాహనంలో వెళ్లిపోయారు. పులి చర్మం కేసులో అమాయకులను అరెస్ట్‌ చేయడంతో పాటు ఎంతో పవిత్రంగా భావించే ఈ మాసంలో తమ ఇళ్లల్లోకి అధికారులు బూట్లతో వచ్చి సోదాలు చేశారని ఆరోపిస్తూ ఇంద్రవెళ్లిలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మరో వైపు.. ఫారెస్ట్‌లో వేటగాళ్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంత నిఘా, సీసీ కెమెరాలు పెట్టినా వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. పులులకు నిలయమైన ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో స్మగ్లర్లు అడవి జంతువులను రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. వాటి చర్మాన్ని, గోర్లను తీసుకొని విదేశాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నారు. తాజాగా ఆసీఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితమే వెలుగులోకి రాగా.. గోప్యంగా ఉంచిన అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. రెండు పులుల హతం అయినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వాటిలో ఒక చర్మాన్ని పట్టుకున్నట్టు.. మరో చర్మం పక్క రాష్ట్రానికి తరలించినట్టు సమాచారం. అయితే.. ఈ స్మగ్లింగ్‌కు పాల్పడినట్టు అనుమానిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. చంపేసిన పులులు కూడా కాగజ్‌నగర్‌ కారిడార్‌లో సంచరించిన పులులుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఇంద్రవెల్లి, హీరాపూర, కాగజ్‌నగర్‌ ప్రాంతాల్లో మాత్రం రహస్యంగా విచారణ కొనసాగతోంది. ఈ సందర్భంలోనే అరెస్టుకు వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో ఈ గొడవ మొదలయింది.

No comments:

Post a Comment