వివేక్ మృతికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదు

Telugu Lo Computer
0

 


ప్రముఖ తమిళ  కమెడియన్ అయిన వివేక్ ఏప్రిల్ 17న ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే మరణం వెనుక గల కారణాలపై ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి. వివేక్ మరణించడానికి రెండు రోజుల ముందే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కానీ వివేక్ మరణానికి కారణం గుండెపోటు అని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే వ్యాక్సిన్ వికటించడం వల్లనే వివేక్ మరణించారు అని ఊహాగానాలు వినిపించాయి. దీంతో వివేక్ మరణం వెనుక మిస్టరీని ఛేదించేందుకు సామాజిక కార్యకర్త శరవణన్ రంగంలోకి దిగి. వివేక్ మృతి గురించి ఆయన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో మానవ హక్కుల సంఘం ఆ ఫిర్యాదు పై కేంద్ర ఆరోగ్య శాఖని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ శాఖ కు ఈ బాధ్యత అప్పగించగా వివేక్ మృతిపై దర్యాప్తు చేపట్టారు. స్టడీ చేసిన తరువాత తిరిగి కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదికను అందించారు. ఆ నివేదికలో వివేక్ మరణానికి కారణం వ్యాక్సిన్ కాదని కేవలం అధిక రక్తపోటు మరియు గుండె పోటుతో మరణించారని తేల్చారు. వ్యాక్సిన్ వేయించుకున్న రెండు రోజులకే వివేక్ మృతిచెందడం కేవలం యాదృచ్ఛికం మాత్రమే అని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)