పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ మొండిచెయ్యి

Telugu Lo Computer
0

 


ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ ప్రభుత్వానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) మొండిచెయ్యిచ్చింది. రుణం ఇచ్చేందుకు ససేమిరా అన్నది. రుణాలు తీసుకుంటూ వ్యవస్థను నడిపే ఫార్ములాపై పనిచేస్తున్న పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని పాకిస్తాన్‌ చేసుకున్న విజ్ఞప్తిని ఐఎంఎఫ్‌ తోసిపుచ్చింది. పాకిస్తాన్ వార్తాపత్రిక 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' కథనం ప్రకారం, అక్టోబర్ 4-15 తేదీల మధ్య జరిగిన చర్చలు అసమగ్రంగా ముగిశాయి. ఐఎంఎఫ్‌ నుంచి రుణం తీసుకునేందుకు విద్యుత్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెంచి ఆకర్శించేందుకు ప్రయత్నించినా.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాచిక పారలేదు. అంతమొత్తంలో రుణం ఇవ్వలేమని ఐఎంఎఫ్‌ కరాఖండిగా చెప్పేయడంతో.. ఇమ్రాన్‌ ఇన్నిరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు వృధాగా మారాయి. ఐఎంఎఫ్‌ను ఒప్పించేందుకు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి షౌకత్ తారిన్ చర్చలు జరిపాడు. ఐఎంఎఫ్‌ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా, దక్షిణ-మధ్య ఆసియా సంయుక్త సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూతో భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఐఎంఎఫ్‌తో పాకిస్తాన్ నిరాశ చెందడం ఇది రెండోసారి. జూన్‌లో మొదటి ప్రయత్నం కూడా ఫలించలేదు. ఐఎంఎఫ్‌ మొండి చెయ్యివ్వడంతో ఇప్పుడు రుణం పొందేందుకు చైనా లేదా గల్ఫ్ దేశాలను అభ్యర్థించే అంశంపై ప్రభుత్వంలో చర్చ ప్రారంభమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)