ఏలైట్‌ క్లబ్‌లో ముఖేశ్‌ అంబానీ

Telugu Lo Computer
0


రిలయన్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మరో సరికొత్త రికార్డును నమోదు చేశారు. 100 బిలియన్‌ డాలర్ల ఏలైట్‌ క్లబ్‌లో జాయినైనా తొలి ఆసియా వ్యక్తిగా ముఖేశ్‌ అంబానీ రికార్డు సృష్టించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం... ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్‌తో కలిసి ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన సంపద క్లబ్‌లో చేరాడు. బ్లూమ్‌ బర్గ్‌ నివేదిక ప్రకారం...3.22 బిలియన్‌ డాలర్ల సంపదతో ముఖేష్‌ అంబానీ సంపద 101 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్‌ అంబానీ 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు అదానీ సంస్థల అధినేత గౌతమ్‌ అదానీ 73.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 14 వ స్థానంలో కొనసాగుతున్నారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తన తండ్రి మరణాంతరం కంపెనీ పగ్గాలను చేపట్టాడు. చమురు శుద్ధి ,పెట్రోకెమికల్స్ వ్యాపారాలను వారసత్వంగా పొందినప్పటి నుంచి రిలయన్స్‌ పలు రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. అంతేకాకుండా ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఆరామ్‌ కో వంటి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో గ్రీన్ ఎనర్జీకి ప్రతిష్టాత్మకమైన ప్రోత్సాహాన్ని ఆవిష్కరించారు. వచ్చే మూడు సంవత్సరాలలో సుమారు 10 బిలియన్ల డాలర్లను పెట్టుబడిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రణాళికాబద్ధమైన పెట్టుబడితో వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి, శక్తి దిగుమతులను తగ్గించడానికి భారత్‌ పరిశుభ్రమైన ఇంధన గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చాలని ముఖేశ్‌ అంబానీ ప్రణాళికలు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)