జర్నలిస్టులకు నోబెల్ శాంతిపురస్కారం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 8 October 2021

జర్నలిస్టులకు నోబెల్ శాంతిపురస్కారం


ఈ యేడాది నోబెల్ శాంతి పురస్కారం ఇద్దరు జర్నలిస్టులను వరించింది. వారిలో ఒకరు మారియా రెస్సా (అమెరికన్), మరొకరు డిమిట్రీ మరటోవ్‌ (రష్యన్). సుస్థిర ప్రజాస్వామ్యానికి, చిరకాల శాంతికి భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యమే పునాది అని బలంగా నమ్మి ఈ ఇద్దరు జర్నలిస్టులు ఆచరించారని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. మారియా రెస్సా ఫిలిప్పినో సీఎన్ఎస్ ఆగ్నేయాసియా విభాగంలో 20 ఏళ్ల పాటు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వ్యక్తి వాక్ స్వేచ్ఛను అనేక వేదికలపై నిర్భయంగా చాటారు. ఫిలిప్పీన్స్ చట్టాల ప్రకారం అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎక్కడా బెదరలేదు. ఓసారి అరెస్ట్ అయ్యారు. అప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాలపైనే నిలబడ్డారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే విమర్శకుల్లో మారియా రెస్సా ముందు వరుసలో ఉంటారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్‌పైనా పోరాటం సాగించారు. డిమిట్రీ మరటోవ్ అనే జర్నలిస్టు నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. రష్యా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలోనూ, మానవ హక్కుల ఉల్లంఘనలపై నిలదీయడంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఇప్పటి ప్రపంచంలోనూ పాత్రికేయ విలువలు, మూలాలకు కట్టుబడిన మరటోవ్ 2007లో ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు, 2010లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి లెజియన్ ఆఫ్ ఆనర్ ఆర్డర్ పురస్కారం అందుకున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad