ఫోన్ హ్యాక్ అయ్యిందని అనుమానంగా ఉందా!

Telugu Lo Computer
0


స్మార్ట్ ఫోన్ నిత్యావసరాలలో ఒకటైంది.  ఆన్‌లైన్ లావాదేవీలు, వాట్సప్ మెసేజ్‌లు, ఆఫీస్ సమాచారం, పలు చెల్లింపుల ఇలా చాలా పనులు దాదాపు స్మార్ట్‌ఫోన్‌తో నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల కన్ను ఫోన్ వినియోగదారులపై పడింది. పలురకాలు సాంకేతకతో ఫోన్‌లు హ్యాక్ చేసి మన ముఖ్యమైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. ఈ హ్యకింగ్ కోసం మిషన్ లర్నింగ్‌ను వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఫోన్‌లు వైరస్ బారిన పడడంతోపాటు మన డేటా చోరీ జరుగుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ తెలిపిన గణాంకాల ప్రకారం కోవిడ్-19 వల్ల 600 శాతం సైబర్‌ క్రైమ్‌ పెరిగినట్లు తెలిపింది. మీ ఫోన్‌లో మీకు సంబంధంలేని యాడ్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాయంటే జాగ్రత్త పడాల్సిందే. ఫోన్ బ్యాటరీ వేగంగా అయిపోతుందటే మీకు తెలియని ఆప్లికేషన్‌లు ఫోన్‌లో రన్ అవుతున్నట్టు ఇది హ్యాకింగ్ కారణం అవ్వొచ్చు. కొన్ని రకాల అప్లికేషన్‌లు, మాల్వేర్, ట్రోజన్ మీకు తెలియకుండానే మీ కాంటాక్టు లిస్ట్‌లో ఉన్నవారికి మెసేజ్‌లు పంపుతుంటాయి. ఇలా జరిగిందంటే మీ కాంటాక్ట్ లిస్ట్ సైబర్ దాడికి గురైనట్టు. మీకు తెలియకుండా ఫోన్‌లో కొత్త యాప్‌లు వస్తుంటే జాగ్రత్త పడాలి. మొబైల్ డేటా వేగంగా అయిపోతుంటే మాత్రం ఫోన్‌ వైరస్ దాడికి గురైనట్టు గుర్తించాలి. ఇటువంటి తరహా ఇబ్బందులు ఫోన్‌లో కనబడితే ఎదురవుతుంటే మీ ఫోన్‌లో వైరస్‌ దాడి చేసినట్లేనని గుర్తించాలి. వెంటనే వైరస్ లేదా మాల్వేర్‌ను తొలగించే ప్రయత్నం చేయాలి లేదా మీ డేటా మొత్తం చోరీగి గురవుతుంది. మీ ఫోన్ పాడవుతుందన అర్థం. ఇలాంటి సమస్యల రాగానే ఫోన్‌లో ముఖ్యమైన డేటాని కాపీ చేసుకొని ఫోన్ ఫార్మెట్ చేసుకోవడం ఉత్తమం. మెయిల్స్ - సైబర్‌ నేరస్తులు స్మార్ట్‌ ఫోన్లు, లేదంటే ఐఫోన్లపై ప్రత్యేకంగా తయారు చేసిన వైరస్‌లను మెయిల్స్ ద్వారా పంపుతారు. ఈ మెయిల్‌ను డెలిట్ చేయండి లేదా బ్లాక్ చేయండి అంతే కాని అందులోని లింక్‌ను క్లిక్ చేయొద్దు. నోటిఫికేషన్‌లు - కొన్ని సార్లు అన్‌వాంటెడ్ నోటిఫికేషన్‌లు వస్తుంటాయి. ముఖ్యంగా ఆఫర్‌లు ఇస్తామని వాటిని నమ్మి క్లిక్ చేస్తే మీ ఫోన్ డేటా చోరీకి గురవ్వడానికి అవకాశం ఇచ్చినట్టే. యాప్స్ - ముఖ్యంగా ఏదైనా యాప్స్‌ డౌన్‌ లోడ్‌ చేసుకునే ముందే ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే మంచిదా? లేదంటే దాడులకు పాల్పడే అవకాశం ఉందా అని తెలుసుకోవాలి. అందుకోసం మీరు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకునే సమయంలో సంబంధిత యాప్‌ వివరాలు, రివ్యూలు చెక్‌ చేయాలి

Post a Comment

0Comments

Post a Comment (0)