నలుగురు నాయికలతో రజనీకాంత్‌ 'పెద్దన్న' - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 27 October 2021

నలుగురు నాయికలతో రజనీకాంత్‌ 'పెద్దన్న'


రజనీకాంత్‌  హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'అన్నాత్తే'. తెలుగులో 'పెద్దన్న'  పేరుతో విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదలచేసింది. రజనీకాంత్‌ అభిమానులు కోరుకునే యాక్షన్‌, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్‌ స్టైల్, సంభాషణలు మెప్పిస్తున్నాయి. రజనీకాంత్‌ సోదరిగా కీర్తి సురేశ్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రజనీకి జోడీగా నయనతార మెరిసింది. మీనా, ఖుష్బూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: డి. ఇమ్మాన్‌, ఛాయాగ్రహణం: వెట్రి. 

No comments:

Post a Comment