వర్క్‌ఫ్రం హోంకు స్వస్తి ?

Telugu Lo Computer
0



నవంబర్ 15 నుంచి ఉద్యోగులంతా ఆపీసులకు రావాలని టీసీఎస్ ఆదేశించినట్లు టెక్ వెబ్‌సైట్ ట్రాక్ ఇన్ ఓ వార్తా కథనం ప్రచురించింది. దీంతో కరోనాను నియంత్రించడానికి గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికినట్లైందా.. అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీసీఎస్‌లోని ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని సంస్థ హెచ్ఆర్ హెడ్ మిలిండ్ లక్కాడ్ చెప్పారు. రెండు డోస్‌ల వ్యాక్సిన్లు వేసుకున్న వారు మాత్రమే ఆఫీసులకు రావాలని మిలింద్ లక్కాడ్ చెప్పారని తెలిసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ప్రస్తుతం 70 శాతానికి పైగా రెండు డోస్‌లు వేసుకున్నారు. 95 శాతం మంది టీసీఎస్ ఉద్యోగులు సింగిల్ డోస్ వేయించుకున్నారు. అర్హులైన ఉద్యోగులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నుంచి 100 శాతం అలవెన్స్‌లు పొందుతారన్నారు.  2025 నాటికి కేవలం 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులో సేవలందిస్తారని, మిగతా 75 శాతం మందికి వర్క్ ఫ్రం హోం వర్తిస్తుందని ప్రకటించింది. గత కొన్ని వారాలుగా టీసీఎస్ ఉద్యోగుల్లో 80 శాతం మందికి పైగా ఆఫీసులకు వస్తున్నారని సంస్థ ఇంతకుముందు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)