కోర్టుకే కథలు చెబుతారా? సుప్రీం తీవ్ర ఆగ్రహం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 20 October 2021

కోర్టుకే కథలు చెబుతారా? సుప్రీం తీవ్ర ఆగ్రహం


దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన లఖింపుర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. బుధవారం జరిగిన విచారణ సందర్భంగా యూపీ సిట్ దర్యాప్తు జరుపుతోన్న తీరును, సాక్షుల గురించి ఆలస్యానికి చెబుతోన్న కారణాలను సీజేఐ బెంచ్ తప్పుపట్టింది. తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వారం రోజుల్లోగా రిపోర్టు ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. కేసు విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో సుప్రీకోర్టుకు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు సమర్పించారు. ఈ విచారణ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానిస్తు..''' ఈ కేసులో మీరు 34 మంది సాక్ష్యులను విచారించారు. నలుగురి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. మిగిలినవారివి ఎందుకు చేయలేదు? అంత పెద్ద ఘటనలో కేవలం నలుగురే సాక్షులా?!.. కేవలం నలుగురి వాంగ్మూలాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి? అని ప్రశ్నించారు.అంతేకాకుండా..ఈ కేసులో యూపీ ప్రభుత్వం..వారి సిట్ ఏం చేస్తున్నట్లు? హింసాకాండను చూసిన సాక్షులను గుర్తించడంలో ఎందుకు ఆలస్యమవుతోంది? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అదేమని ప్రశ్నిస్తే అర్థం పర్థం లేని సమాధానాలు చెబుతున్నారు. క్రైమ్​ సీన్ రీ కన్​స్ట్రక్షన్ అంటున్నారు. సెక్షన్ 164 కింద జరిగే సీన్ రీ కన్​స్ట్రక్షన్.. సాక్ష్యాలను సేకరించటానికి మీకేమి అడ్డంకులు ఉన్నాయి? మీ తీరు చూస్తే కేసును కావాలనే సాగదీస్తున్నట్లుగా ఉంది..మీరు ఏం చేసినా..ఈ కేసును ఓ అంతులేని కథగా మేం వదిలేయబోవడం లేదని మీరు గుర్తుంచుకోండి..'అంటూ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇన్వెష్టిగేషన్ ఎప్పుడూ అంతులేని కథలుగా మిగలకూడదు. సాక్ష్యులను త్వరగా విచారించండి. వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయండి. ఈ కేసులో అభియోగాలు చాలా తీవ్రమైనవని మర్చిపోవద్దు..త్వరగా అన్ని వివరాలు కోర్టుకు సమర్పించండీ అంటూ యూపీ ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది.ఈ కేసులో వాదనలు పూర్తి అయిన తరువాత యూపీ ప్రభుత్వ న్యాయవాది హరీశ్ సాల్వే.. కేసును శుక్రవారానికి వాయిదా వేయాలని కోరగా ధర్మాసనం నిరాకరిస్తు.. అక్టోబర్ 26కు వాయిదా వేసింది. ఆ విచారణకు ముందే స్టేటస్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

No comments:

Post a Comment