ఉచిత గృహవసతి గడువు పొడిగింపు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 15 October 2021

ఉచిత గృహవసతి గడువు పొడిగింపు


ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని పొడిగించేందుకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ నుంచి పూర్తిగా తరలిరాని ఉద్యోగుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వసతిని 2022 ఏప్రిల్‌ వరకు (ఆరు నెలలపాటు) పొడిగించా లని సీఎం జగన్‌ ఆదేశించినట్టు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాల యం సంబంధిత అధికారులు సమాచారం పంపినట్టు వెల్లడించారు. ఈనెలాఖరుతో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత వసతి గడువు ముగుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ విజ్ఞప్తి మేరకు సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment