వంటపాత్ర లో పెండ్లి మండపానికి......!

Telugu Lo Computer
0

 


నేల చరియలు విరిగిపడటం.. నీటి ప్రవాహంలో మృతదేహాలు కొట్టుకురావడం, అమాంతం బిల్డింగులు నేలకొరగడం వంటి విషాద ఘటనలు కేరళలో కొద్ది రోజులుగా కనిపిస్తున్నాయి. మూడు రోజులుగా ఇవే పరిస్థితుల్లో రాష్ట్ర వాసులు తంటాలు పడుతున్నారు.కొద్ది రోజుల క్రితం కళ్యాణ వేదిక పక్కనే ఉన్న గుడికి వెళ్లినప్పుడు అస్సలు నీళ్లు లేవు. రెండ్రోజుల క్రితం వెళ్తే భారీ వర్షాలతో వరదలా మారిపోయింది వాతావరణం. వధూవరులు ఇద్దరు చెంగనూర్ లోని హాస్పిటల్ లో హెల్త్ వర్కర్లుగా పనిచేస్తున్న వీరికి  ఇవేమీ తమ పెళ్లికి ఆటంకం కాదని, ఎవరు వచ్చినా… రాలేకపోయినా పెళ్లి ఆగదని నిరూపించారు. పెండ్లి మండపానికి పెద్ద అల్యూమినియం పాత్రలో చేరుకున్నారు. వరదతో నిండిపోయిన హాల్ లో నిర్ణయించిన ముహూర్తానికే అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో ఒకటయ్యారు. ఆకాశ్, ఐశ్వర్యలు ఆ గిన్నెలో ప్రయాణిస్తూ కళ్యాణ వేదికకు వెళ్తున్న ఘటన టీవీ విజువల్స్ లో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు కావడంతో వైరల్ అయింది. జిల్లా వ్యాప్తంగా నీటి స్థాయి పెరుగుతుందని సమాచారం తెలిసింది. ముందుగానే కొవిడ్ మహమ్మారి భయంతో పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను పిలిచాం. సోమవారం అనుకున్న ముహుర్తానికే అక్కడికే చేరుకున్నాం. అని కొత్త జంట చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)