స్టాలిన్ సంచలన నిర్ణయం

Telugu Lo Computer
0


తమిళనాడు ముఖ్య మంత్రి  స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాహనాల సంఖ్యను తగ్గించారు. సీఎం కాన్వాయ్‌లో పదికి పైగా వాహనాలు ఉంటాయి. అయితే ఇకపై కాన్వాయ్‌లో కేవలం ఆరు వాహనాలు మాత్రమే ఉండాలని సీఎం సూచించారు. ఇక ఆయన పయనించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయకుండా.. ప్రజల వాహనాలతో కలిసి ఆయన కాన్వాయ్‌ సాగే విధంగా ఆదివారం నుంచి చర్యలు తీసుకోనున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీ ఐరా అన్బు, అదనపు సెక్రెటరీ ఎస్కే ప్రభాకర్, డీజీపీ శైలేంద్ర బాబు, అదనపు డీజీపీ డేవిడ్‌సన్ దేవసిరివతమ్ తదితర ఉన్నతాధికారులతో శనివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)