ఆకాశాన్ని అంటుతున్న టమోటా ధర !

Telugu Lo Computer
0


భారీ వర్షాలకు కూరగాయల తోటలు దెబ్బతినడంతో  టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.  మరీ ముఖ్యంగా టమోటా ఎక్కువగా సరఫరా అయ్యే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు పంటను దారుణంగా దెబ్బతీశాయి. దీంతో ఒక్కసారిగా సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరిగిపోయింది. కోల్‌కతాలో కిలో టమోటా ధర రూ. 93కు చేరుకోగా, చెన్నైలో రూ. 60, ఢిల్లీలో రూ. 59, ముంబైలో రూ. 53గా ఉంది. మరో 50 నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దాదాపు ప్రతి చోట కిలో టమాటా ధర రూ. 50 దాటేసింది. హైదరాబాద్‌లో కిలో రూ. 70-80 మధ్య పలుకుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)