స్త్రీని అవమానించి, అసహ్యించుకోకండి ....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 22 October 2021

స్త్రీని అవమానించి, అసహ్యించుకోకండి ....!


శరీరంలో మలమూత్రాలు తయారైనట్లుగా యవ్వనం లో పురుషులకు శుక్రకణాలతో కూడిన వీర్యం తయారవుతుంది, అలాగే స్త్రీ అండంలో పిండానికి ఆహారం తయారవుతుంది. ఆ స్త్రీ, పురుషునితో లైంగికంగా పాల్గొన్నప్పుడు శుక్రకణo అండపుగుడ్డులోకి చొరబడి పిండంగా రూపుదిద్దుకున్నపుడు అండంలో తయారైన ఆహారం అండంలోని శిశువును బ్రతికిస్తుంది. శుక్రకణం అండంతో కలవనప్పుడు అండాశయంలో తయారైన ఆహారం బహిస్టురూపంలో బయటికి వస్తుంది. ఈవిధంగా ప్రతినెల ఆహారం తయారవుతుంది బయటకువస్తుంది, శుక్రకణం అండంతో కలిసిన మాసంలో గర్భం దరించి బహిస్టురాదు, అప్పటినుండి బహిష్టు ఆగిపోయి శిశువుకు ఆహారంగా ఉపయోగపడుతుంది, ప్రతినెల వచ్చేబహిస్ట్ ఆగిపోవడాన్ని నెలతప్పడం అంటారు, ఇది ప్రతిశరీరంలో జరిగే ప్రక్రియ. ఆ మూడురోజులు శరీరం నీరసంగా ఉంటుంది కాబట్టి ఒక దగ్గర కూర్చోవాలని అప్పటివాళ్ళు పెట్టుకున్న ఏర్పాటు, ఇప్పటిలాగా పాడ్స్ పెట్టుకొని చకచకా తిరగడాని కి అప్పుడు పాడ్స్ లేవు, స్త్రీలకు కూడా ఈవిషయం తెలియక ఈరోజుల్లోకూడా కోట్లమంది స్త్రీలు అపచారం అనుకుంటారు, ఇది శరీరంలో జరిగే సహజసిద్ధమైన ప్రక్రియ. దీన్ని అనవసరపు రాద్ధాంతం చేయడం మూర్ఖత్వం. భారత సమాజంలో ఋతుస్రావం గురించి పబ్లిక్ గా మాట్లాడటం నేరంగా, బూతుగా భావించే దుర్మార్గమైన సంస్కృతి పాతుకుపోయి ఉన్నది. ఋతుస్రావం పట్ల ఇంకా అనేక చర్చలు జరగవలసి ఉంది. అనేక గొంతులు మౌనాన్ని వీడాల్సి ఉంది. ఈ సమాజంలో పెనుమార్పులతో కూడిన నూతన చైతన్యం వెల్లివిరియాల్సి ఉంది. స్త్రీలు ప్రతినెలా మూడు రోజుల నుండి ఐదు రోజుల పాటు ఋతుస్రావానికి బాధపడాల్సి ఉంటుంది. అది ప్రకృతిలో సహజమైనప్పటికి ఆ సమయం చాలా భయంకరమైంది. ఆ సమయంలో స్త్రీలు పడే ఇబ్బంది, పెయిన్, వేదనను అక్షరీకరించడానికి అక్షరాలు పూర్తిగా న్యాయం చేయలేమని గొల్లుమంటాయేమో. తీవ్రమైన బాధ, కడుపునొప్పి, ఒక్కోసారి ప్రాణాలు పోతాయేమోనన్నంతటి పెయిన్, నీరసం లాంటివి స్త్రీలను పీడిస్తాయి. ఆ వేదననంతటినీ ఓర్చుకోవడం కోసం బాధనంత పంటి బిగువున దాచేస్తుంటారు. అసహజమైన స్థితిలోంచి కృత్రిమ చిరునవ్వుతో సహజమైన స్థితిలోకి వస్తుంటారు. యధావిధిగా అందరిలో కలిసిపోతుంటారు. కలిసిపోతు వాళ్ళు ఎంత అలసిపోతారో మన సమాజం ఎప్పుడూ గుర్తించదు. కనీసం గమనించదు. అట్లా చేయడానికి ప్రయత్నించదు. అంతే కాదు. ఋతుస్రావాన్ని అంటుగా చూస్తుంది. గడప అవతలకి ముట్టుగా నెట్టివేస్తుంది. ఒక్కోసారి ఎముకలు కొరికే చలిలో అనారోగ్యం పాలవుతున్న స్థితిని గుర్తించదు. వాళ్ళకు సాయంగా ఓ చెయ్యి అందించడానికి ముందుకు రాదు. అట్టా రాకపోవడం పట్ల ఈ సమాజం సిగ్గుపడదు. సిగ్గులేనితనానికి సంస్కృతి అనే పేరును తగిలిస్తారు. దానిని భారతీయ సంస్కృతిగా చలామణి చేస్తారు. అట్లాంటి సంస్కృతి ఎంత కృారమైందో ఆలోచించాల్సి ఉంది. మనిషి బాధను గుర్తించడానికి సిద్ధపడని అనాగరికతను సంస్కృతిగా చెలామణి చేయడం ఎంత సిగ్గులేని తనమో కదా .. నేను మగాడిని అని విర్రవీగే వాడా నువ్వు మగాడిలా ఇలా ఉన్నావు అంటే కూడా ఆ ఆడతల్లి పడ్డ ఎన్నో కష్టాల ఫలితమే ... ఆడవాళ్ళు పడే కష్టాలను గుర్తించకపోయినా పర్వాలేదు కానీ అవమానించి అసహ్యించుకోకండి .... .

No comments:

Post a Comment