మూడు రోజులు పెట్రోల్ ఫ్రీ

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ బేతుల్‌ జిల్లాకి చెందిన దీపక్ సైనానికి పెట్రోల్ బంక్ ఉంది. ఈ నెల 9వ తేదీన అతని సోదరి శిఖా పోర్వాల్‌కు ఆడపిల్ల జన్మించింది. దీంతో ఆ కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ సంబరాలను ప్రత్యేకమైన రీతిలో జరుపుకోవాలని వారు భావించారు. ఈ క్రమంలోనే నవరాత్రి పర్వదినాల్లో బంక్‌కు వచ్చే కస్టమర్లకు మూడు రోజులు ఉచితంగా పెట్రోల్ అందించాలని భావించాడు. అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేసే ముందు తాను చాలా విధాలుగా ఆలోచించానని దీపక్ సైనాని తెలిపారు. 'ప్రజలు దీనిని పబ్లిసిటీ స్టంట్‌గా భావించాలని నేను కోరుకోలేదు. అందుకే నేను ఆలోచన సరైనదా..? కాదా..? అని కొద్దిసేపు విశ్లేషించుకున్నాను. కానీ ఆ నిర్ణయంపై ముందుకు సాగాలని డిసైడ్ అయ్యాను'అని దీపక్ సైనాని తెలిపాడు. తన బంకుకు వచ్చిన కస్టమర్లకు పెట్రోల్‌ ఫ్రీ అని ప్రకటించాడు. అక్టోబర్ 13,14,15 తేదీల్లో తన నిర్ణయాన్ని అమలు చేశాడు. ఆ రోజుల్లో కస్టమర్లకు 5-10 శాతం అదనపు పెట్రోల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు పెట్రోల్ బంక్‌లో బోర్డులు ఏర్పాటు చేశారు. అక్టోబర్‌ 13, 14, 15 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్‌ ఉచితం అని ప్రకటించాడు. రూ.100లకు పెట్రోల్‌ కొన్న కస్టమర్లకు 5 శాతం, 200 - 500 రూపాయలకు పెట్రోల్‌ కొన్నవారికి 10 శాతం పెట్రోల్‌ ఫ్రీగా అందించారు. 'నేను ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉండటం గమనించాను. దీంతో ఈ సమయంలో అదనంగా 5-10 శాతం అందించాలని నిర్ణయించుకున్నాను'అని దీపక్ సైనాని  తెలిపాడు. ఇక, ఈ బంక్ తన సోదరుడితో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నానని దీపక్ చెప్పాడు. అయితే తన సోదరి వైకల్యంతో బాధపడుతుందని ఈ చర్య ద్వారా తాము ఆమెకు బహుమతి అందజేశామని అన్నాడు. పెట్రోల్ ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఇలా మూడు రోజుల పాటు పెద్ద మొత్తంలో పెట్రోల్‌ను అందించడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆఫర్ కోసం జనాలు దీపక్ పెట్రోల్ బంక్ వద్దకు భారీగానే చేరుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)